మన ఉగాది ముద్దు - జనవరి 1 వద్దు

డిశంబర్ 31..నీ జేబుకి బొక్క.నీ బుద్ధికి విషపు చుక్క.నీ జీవితానికి ఈ అర్థరాత్రి మాయని మచ్చ కాకూడదనే మా కోరిక..

క్యాలండర్ అంటే ఏమిటి?

కాలర్ అంటే పిలుపు ఇవ్వటం(లాటిన్ భాషలో)..వేల ఏళ్ళ క్రితం గ్రీకులు పాఢ్యమి చంద్రుడు కనపడగానే నెల మొదలైందంటూ అనుకునేవారు.రోము నగరములొ నెల మొదలైందని పిలుపు ఇచ్చేవాళ్ళు.రోమన్లు క్రీ.పూ.8వ శతాబ్దిలో 10నెలలుండే క్యాలండర్ ప్రవేశపెట్టారు.అప్పుడు కూడా మార్చి నుండే సంవత్సరం మొదలయ్యేది.మన ఉగాది కూడా సుమారుగా మార్చిలోనె వస్తుంది కదా!

మన పూర్వీకులు ఖగోళ శాస్త్రం అధ్యయనం చేసి కనుక్కుని,అమలుచేస్తున్న మన కాలగమనాన్ని,పంచాంగాన్ని విదేశీయులు గ్రహించినవే ఇవన్నీ..సంవత్సర ప్రారంభం ‘జనవరి ‘ అని ప్రకటించి విదేశీయులు తలా తోకా లేని విధానాన్ని అమలుపరిచారు.

సంవత్సరం అనేది కాలమానంలో ఒక అంశం.నక్షత్రాలు,గ్రహాల ఉనికి – చలనాలను బట్టి కాలమానం ఏర్పడింది.ఎటువంటి ప్రత్యేకత లేని జనవరి 1 కి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఖర్చులు పెట్టడానికి ముందుగా బడ్జెట్లు రూపొందించుకుని,యువకులైతే,తల్లిదండ్రులను బలవంతం చేసొ,అప్పులు చేసో,బైకుల మీదా,కార్ల మీదా వాళ్ళు చేసే వీర విహారాలు ఎన్ని అనర్థాలకు దారి తీస్తున్నయో ఊహించండి.

ప్రభుత్వం కూడా ప్రజలను మరింత త్రాగుడుకు బానిసలు చేసే విధంగా ఈ డిశంబర్ 31 రాత్రికి 67లక్షల లీటర్ల మద్యాన్ని యువకులకు త్రాగించదానికి సిద్ధపరిచింది.దీంతో ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం.మరో ప్రక్క త్రాగి రోడ్డున పడే యువకులపై కేసులు పెట్టి డబ్బులు గుంజడానికి పోలీస్ శాఖను కూడా సిద్ధపరిచింది.ఇంకో ప్రక్క పక్క వ్యాపారం చేసి యువకుల బలహీనతలతో ఆడుకుంటూ లాభాలు గడించడానికి హోటళ్ళు,చానళ్ళు,కంపనీలు కూడా కాచుకుని కూచున్నాయి.

అసలే కోతీ…ఏమి చేస్తుందో తెలుసు.పైగా ఆ కోతి కల్లు త్రాగింది..ఇక ఏమి చేయనుందో ఇక చెప్పవలసిన అవసరం లేదు..

దేశానికి తమ జవశక్తులతో,మేధస్సుతో ఉపయోగ పడే లక్షలాది యువకులు,బుద్ధిని కప్పి వుంచే మద్యానికి బానిసలై పోతుంటే,ఈ డిశంబర్ 31 అర్థరాత్రి మైకం ఎన్ని వేలమందిని ఆలోచించకుండా చేస్తున్నదో,బ్రిటిష్ వాడు పతి పెట్టిన బానిస విత్తు,విష్ యు హ్యపీ న్యూ ఇయర్ అంటూ, ప్రభుత్వానికి,కంపనీలకు,బ్రిటిష్ వాళ్ళకు హాపీ గానే వుంటుంది.కాని చివరికి మాత్రం డిశంబర్ 31..నీ జేబుకి బొక్క.నీ బుద్ధికి విషపు చుక్క.నీ జీవితానికి ఈ అర్థరాత్రి మాయని మచ్చ కాకూడదనే మా కోరిక..

తాగుబోతు దినోత్సవం,తరుముకొంటూ వస్తున్నది…
జనవరిలో కెళ్ళేముందే, జాన్వర్ గా మార్చేందుకు…
౹౹ తాగుబోతు ౹౹

తప్పతాగి ఎంతూగినా, తప్పుండదు ఆనాడూ…
తెల్లార్లూ తాగి ఊగు, తెల్లవాడి వారసుడిగ…
క్లబ్బుల్లో పబ్బుల్లో, కల్సిమెల్సి తిరుగొచ్చు…
సభ్యులైన వాళ్ళంతా, అభ్యుదయ వాదులంట…
౹౹ తాగుబోతు ౹౹

మనదీ కాకున్ననేమీ, మంచిదైతే బాగుండును…
చుక్కల గమణం చెప్పని, తప్పుల క్యాలండరది…
అందమైన చంద్రుడి గతి, అందుకోని క్యాలండర్…
అమావాస్య పౌర్ణమంటే, అసలేంటో తెల్వదంట…
గ్రహణం గతులిందులోన, ఎంతెతికిన దొరుకవంట…
౹౹ తాగుబోతు ౹౹

బానిసత్వ పాపానికి, బహుమతిగా వచ్చిందోయ్…
భారతీయ సంస్కృతిని, బల్లిలాగ పట్టిందోయ్…
త్యాగధనులంతకల్సి,ఆంగ్లేయుల తరిమేస్తే…
మత్తులోన ముంచివాడు, మళ్ళీవస్తుండు జూడు…
౹౹ తాగుబోతు ౹౹

మత్తువదిలి చూడు నీవు, మనపండుగ ఉగాదిని…
ఏడాదికే కాదు ఆది, యుగానికీ ఆదేనోయ్…
ప్రకృతితో పెనవేసిన, పండుగలు మనవండీ…
విజ్ఞానం జోడించిన, విలువలతో నిండెనండి…
౹౹ తాగుబోతు ౹౹

వేలయేళ్ళ కాలగణన, వేళ్ళతోనే లెక్కించిరి…
ఖగోళం భూగోళం, కథలతోనే వివరించిరి…
పరిణామ క్రమాన్నంత, పురాణాల్లో వర్ణించిరి…
ఉగాది పచ్ఛడికే ఊఊఊఊ… కోట్టవోయ్,తాగుబోతు పండుగను ఛీఛీఛీఛీఛీ… కొట్టవోయ్…
౹౹ తాగుబోతు ౹౹