24వ అధ్యాయము
కార్తిక శుద్ధ ద్వాదశీ (క్షీరాబ్ధి ద్వాదశీ) అంబరీషోపాభ్యాసము

అత్రి ఇట్లు పల్కెను అగస్త్యమునీంద్రా ! నీకు కార్తికవ్రతమందును, హరిభక్తియం దును ఆసక్తియున్నది. కాన కార్తికమాహాత్మ్యమును చెప్పెద వినుము. సావధానముగా విన్నయెడల పాపములు నశించును. కార్తికమాసమందు శుక్ల ద్వాదశిహరిబోధిని, ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నానఫలమిచ్చును అన్ని ద్వాదశలలో అధికఫలము ఇచ్చునది. సమస్త యజ్ఞములను జేసిన ఫలమును హరిబోధినియగు ద్వాదశి ఇచ్చును. ఇదిగాక యీ ద్వాదశి హరియందును యేకాదశియందును భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమయినది.
ద్వాదశి సూర్యచంద్ర గ్రహణములకంటే అధికపుణ్యప్రదము. ఏకాదశికంటే నూరురెట్లు ఎక్కువది. సమస్త పుణ్యమును యిచ్చునది. ద్వాదశినాడు చేసిన పుణ్యము కోటిరెట్లగును. ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా నున్నను పారణకుపయోగించ వలెను గాని ద్వాదశిని విడిచి పారణ చేయగూడదు.
ఇతర నియమములననన్నిటిని విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణచేయ వలెను. కాని పుణ్యమును గోరువారు ద్వాదశిని విడువగూడదు. ఏకాదశియందుపవాస మాచరించి మరునాడు ద్వాదశికాలము అతిక్రమించక భోజనము చేయవలెను. ఉపవాస ముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును.
ఈ విషయమును దెలిసియే పూర్వమందు పరమభాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువవలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును. అంతలో దుర్వాసమహాముని వచ్చి ఆతిథ్యమను వంకచేత భోజనమును యాచించెను.
అంబరీషుడు సరేనని ద్వాదశిపారణకు దుర్వాససుని రమ్మనెను. దుర్వాసనుడు పారణకు అంగీకరించి అనుష్టానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతిస్వల్పముగా నుండెను. దుర్వాసనుడు రాకపోయెను. ద్వాదశిపోవుచున్నది. ఇట్టి సకంటము సంభవించి నది. అప్పుడు హరిభక్తు డైన అంబరీషుడిట్లు విచారపడసాగెను.
ఈ దుర్వాసనుడు ముని శేషుడు. పారణకొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మ మగును. బ్రాహ్మణునికంటే ముందు భుజించిన యెడల కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏదికుశలము? ఉపవాస మందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందును ద్వాదశిని విడువ రాదు.
ద్వాదశిని విడిచినయెడల హరిభక్తిని విడిచిన వాడనగుదును. ఏకాదశినాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచిన యెడల అట్టిదోషమే సంభవించును. ఇదిగాక ద్వాదశీ పారణాతిక్రమణము పన్నెండు ఉపవాస ముల ఫలమును బోగొట్టును. కాన ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు.
హరివాసరము పుణ్యదినముగాన విద్వాంసుడు విడువరాదు. దానిని విడిచెనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు. అనేక జన్నములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన యెడల నశించును. అందువలన గలిగెడి పాతకమునకు నివృత్తిలేదు. ఒక్క ద్వాదశి అయినను విడువ కూడదు. దీనికి ప్రతీకారములేదు. అనేక వాక్యాలతో పనియేమున్నది. ఇదినిజము. హరివాసరమును విడిచినయెడల హరిభక్తి యుండదు. హరి భక్తిని విడుచుట యందు నాకు మహాభయమున్నది. కాబట్టి యిట్టి సంకట మందు హరిభక్తిని విడుచుటకంటే పారణమే ముఖ్యము. బ్రాహ్మణ శాపము వలన నాకేమియు భయములేదు. శాపమువలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశిని విడిచినచో హరివాసరము (ఏకాదశులు) 10 విడువబడినవియగు. హరివాసర మును విడిచిన యెడల హరిభక్తి లోపించును. గనుక హరిభక్తిని విడుచుటకంటే బ్రాహ్మణశాపమే కొంచెము మంచిది.
కాబట్టి హరిభకికి లోపము తెచ్చుటకంటే బ్రాహ్మణునికంటే ముందు భోజనముచేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అప్లిన
యెడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలయిన బ్రాహ్మణులను ఇట్లని అడిగెను.
ఓ బ్రాహ్మణో ములారా ! వినుడు. దుర్వాసనుడు భోజనమునకు వచ్చెదననెను. నేనట్లంగీకరించితిని. ఇప్పటికిని రాలేదు. ద్వాదవిపోవు చున్నది గనుక బ్రాహ్మణునికంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము. ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశ్యతిక్రమణము గలుగును. గనుక మీరు బలాబలములను విచారించి రెండింటి లోను ఏదియుక్తమో చెప్పుడు అని అడిగెను.
ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవలాఘవములను విచారించి యిట్లనిరి. బ్రాహ్మణులు ఇట్లు పలికిరి. సమస్త భూతములయందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్యభోజ్య చోష్యలేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు.
ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువు లకు అన్నమును గోరెడి ఆకలికలుగుచుండును. ప్రాణవాయువు చేత కొట్ట బడిన జఠరాగ్ని సంతాపమును జేయుటకే క్షుత్పిపాసలనబడును. కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసురపూజితుడగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించ వలెను. కాబట్టి తన యింటికి వచ్చిన శూద్రునిగాని, చండాలుని గాని విడిచి భుజించ రాదు. సాక్షాత్రథమవర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించ రాదని చెప్పవలసినదేమున్నది? గృహసుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది? గృహస్తుడు స్వయముగా అతిథిని బిలిచి అతిథికంటే ముందుగా తాను భుజించిన యెడల బ్రాహ్మణావ మానమగును.
బ్రాహ్మణావమానముచేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి ధర్మము ఇవన్నియును నశించును. ఇదియేమి, అదియేమి, మనస్సులో ఉండే కోరికయు అనగా సంకల్పిత మంతయు నశించును.
బ్రాహ్మణులందరు స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుదురు. దేవతలను తిరస్కరించుటచేత అంతయు నశించును. జాతి మాత్రముచేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసనుడు తపోవంతుడు. ఇతని విషయమందు చెప్పునది ఏమున్నది? ఓ రాజా! ఈ బ్రాహ్మణుడు కోపముచేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు. ఈ బ్రాహ్మణునకును ద్వాదశిపారణకు వచ్చెదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమైయున్నది. ద్వాదశీ పారణను విడిచిపెట్టన ఏకాదుశ్యుపవాసము నకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తములేదు.
బ్రాహ్మణావజ్ఞకు ప్రాయశ్చిత్తములేదు. కాబట్టి ఈ రెండును సమాన ములుగా నున్నవి. ఇందు గురుత్వము, లఘుత్వము మాకు కనిపించుటలేదు. ద్వాదశికాలమందు పారణచేయని యెడల హరిభక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసనుడు శపించును. ఎటయినను అనరమురాక తప్పదు. అదియు కొద్దిగాదు. గొప్ప కీడుగలుగును.
బ్రాహ్మణులందరు శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి.